నేరంలో భాగస్వామి.. ఎవరో కనుక్కోండి! | Kohli Tweets Photo With Partner In Crime MS Dhoni | Sakshi
Sakshi News home page

నేరంలో భాగస్వామి.. ఎవరో కనుక్కోండి!

Nov 21 2019 10:35 AM | Updated on Nov 21 2019 10:37 AM

Kohli Tweets Photo With Partner In Crime MS Dhoni - Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఉంటాడు. అటు సహచర క్రికెటర్లకు సంబంధించి ఫోటోలే కాకుండా ఇటు భార్య అనుష్క శర్మ ఫొటోలను కూడా పెడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే తాజాగా ‘నేరంలో భాగస్వామి’.. అంటూ ఒక ఫోటో పోస్ట్‌ చేసి అందులో వెనక్కి తిరిగి ఉన్నది ఎవరో కనుక్కోమంటూ అభిమానులకు సవాల్‌ విసిరాడు. ధోనితో కలిసి వర్షంలో తడుస్తు ఉన్న ఫోటోను కోహ్లి పోస్ట్‌ చేశాడు. అయితే అక్కడ వెనక భాగం మాత్రమే కనిపిస్తున్న క్రికెటర్‌ ఎవరో ఊహించమంటూ ఒక ప్రశ్న వేశాడు. ‘ మేము ఇద్దరం బౌండరీ వద్ద డబుల్స్‌ను దొంగిలించి నేరం చేశాం. మేమిద్దరం నేరంలో భాగస్వాములమే.  నా ముందు ఉన్న వ్యక్తి ఎవరో కనుక్కోండి’ అంటూ ఫోటోకు జతగా కంటెంట్‌ కూడా జోడించాడు.

కాగా, దీనికి పలువురు అభిమానులు పెద్దగా సమయం తీసుకోలేదు.  అంతా అది ధోనినే అంటూ సమాధానమిచ్చారు. ‘అది ధోనినే.. వెస్టిండీస్‌ సిరీస్‌కు అతను అందుబాటులోకి వస్తాడని అనుకుంటున్నా’ అని సదరు అభిమానులు బదులిచ్చారు. ఈరోజు(గురువారం) వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టుకు ఎంపిక ఉండటంతో అంతా ధోని తిరిగి జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత ధోని మళ్లీ జట్టులో కనిపించలేదు. దాదాపు ఇంటికే పరిమితం కావడంతో ధోని రిటైర్మెంట్‌ తీసుకునే క్రమంలోనే ఇలా రెస్ట్‌ తీసుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటిని ధోని భార్య సాక్షితో పాటు చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ సైతం ఖండించారు కూడా. మరి వెస్టిండీస్‌తో ధోనిని ఎంపిక చేస్తారా.. లేదా అనేది ఆసక్తికరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement