'అతనే బెస్ట్ ఆల్ రౌండర్' | kapil dev is my best all rounder | Sakshi
Sakshi News home page

'అతనే బెస్ట్ ఆల్ రౌండర్'

May 28 2017 1:51 PM | Updated on Sep 5 2017 12:13 PM

'అతనే బెస్ట్ ఆల్ రౌండర్'

'అతనే బెస్ట్ ఆల్ రౌండర్'

భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవే ఇప్పటికీ మన అత్యుత్తమ ఆల్ రౌండర్ అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

లండన్: భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవే మన అత్యుత్తమ ఆల్ రౌండర్ అని  యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దీనిలో భాగంగా టీమిండియా బెస్ట్ ఆల్ రౌండర్ ఎవరిని అడగ్గా, కపిల్ దేవ్ అని ఠక్కున సమాధానమిచ్చాడు.

 

' మీకు ఇష్టమైన షాట్ ఏది' అని అడిగిన మరో ప్రశ్నకు స్ట్రైట్ డ్రైవ్ అని పాండ్యా తెలిపాడు. తాను స్ట్రైట్ డ్రైవ్ ను ఆడటాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడతానన్నాడు. ఇక నెట్స్ లో ఎక్కువగా ఎవరికి బౌలింగ్ చేయడం ఇష్టమని పాండ్యాను అడగ్గా.. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అని పేర్కొన్నాడు. ఏబీకి నెట్స్ లో బౌలింగ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తానన్నాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement