నువ్వే నిజమైన మ్యాచ్‌ విన్నర్‌వి అన్నయ్యా!

Irfan Pathan Praises Yousuf Pathan Regarding IPL Auction - Sakshi

హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్‌కు ఐపీఎల్‌ 2020 వేలంలో చుక్కెదురైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అతడిని వదులుకోగా.. రూ. కోటి కనీస ధరతో అతడు వేలంలో ఉన్నాడు. అయితే ఏ జట్టు కూడా యూసుఫ్‌ పఠాన్‌ను తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్‌, యూసుఫ్‌ తమ్ముడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్విటర్‌లో స్పందించాడు. ‘తాత్కాలిక ఇబ్బందులు ఏవీ కూడా నీ కెరీర్‌ను ప్రభావితం చేయలేవు. నీ అత్యుత్తమ ఆటతీరును ఎప్పటికీ మరిచిపోలేము. నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వే నిజమైన మ్యాచ్‌ విన్నర్‌వి’ అంటూ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. కాగా, యూసుఫ్ పఠాన్ 2019 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున ఆడి పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.

ఆల్‌ రౌండర్‌ యూసుఫ్ పఠాన్‌ 10 మ్యాచ్‌లు ఆడి, 13.33 సగటుతో కేవలం 40 పరుగులనే సాధించాడు. ఐపీఎల్‌ మొత్తం సీజన్లో కేవలం ఆరు బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు.  ఇక యూసుఫ్‌తో పాటు చాలామంది స్టార్‌ క్రికెటర్లకు 2020 ఐపీఎల్‌ వేలం నిరాశే మిగిల్చింది. ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌, ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. కమ్మిన్స్‌ రూ. 15 కోట్లకు పైగా అమ్ముడు పోగా, మ్యాక్స్‌వెల్‌ను రూ. 10.5 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొనుగోలు చేసింది.
చదవండి: ముగిసిన ఐపీఎల్‌ వేలం
కోట్లాభిషేకం



 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top