
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి, ఓపెనర్ డేవిడ్ వార్నర్ రీఎంట్రీ అదిరింది. ఆదివారం ఈడెన్ గార్డెన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శుబారంభాన్ని అందించారు. మొదట నెమ్మదిగా ఆడిన వార్నర్.. ఆతర్వాత గేర్ మార్చి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో తొలి అర్థ సెంచరీని వార్నర్ సాధించాడు. నేటి మ్యాచ్‌లో కేకేఆర్‌పై అర్ధ సెంచరీ సాధించడంతో ఐపీఎల్‌లో 40 అర్థసెంచరీలు సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు.
ఈ క్రమంలో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రస్సెల్ బౌలింగ్‌లో వార్నర్(85; 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు(761) సాధించిన ఆటగాడిగా వార్నర్ మరో రికార్డును సాధించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ(757) రికార్డను అధిగమించాడు. ఇక బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారంణంగా గతేడాది ఐపీఎల్‌కు వార్నర్ దూరమైన విషయం తెలిసిందే.