సెయింట్ ఆండ్రూస్‌కు టైటిల్ | inter school foot ball tournment st andrews school team won the game | Sakshi
Sakshi News home page

సెయింట్ ఆండ్రూస్‌కు టైటిల్

Nov 6 2013 12:05 AM | Updated on Sep 2 2017 12:18 AM

ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు కైవసం చేసుకుంది.

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు 4-3 స్కోరుతో పెనాల్టీ షూటవుట్ ద్వారా సెయింట్ మైకేల్ స్కూల్ జట్టుపై ఘన విజయం సాధించింది. పెనాల్టీ షూటవుట్‌లో బి.భరత్ గోల్ చేశాడు. నిర్ణీత సమయం ముగిసే సమయానికి సెయింట్ ఆండ్రూస్, సెయింట్ మైకేల్ స్కూల్ జట్ల ఆటగాళ్లు స్కోరు సాధించడంలో విఫలమయ్యారు.
 
 దీంతో టైబ్రేకర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్ల స్కోరు 3-3 వద్ద సమమైంది. దీంతో పెనాల్టీ షూటవుట్‌లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు తరఫున జీవన్, గులామ్ హుస్సేన్, అభిషేక్, భరత్ తలా ఓ గోల్స్ చేశారు. సెయింట్ మైకేల్ స్కూల్ జట్టులో మోహిత్, హర్షిత్, అనుమాల్ గోల్స్ చేశారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పల్లవి మోడల్ స్కూల్ జట్టు 3-2తో సెయింట్ పాట్రిక్ స్కూల్‌పై నెగ్గింది.
 
 అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో  సెయింట్ ఆండ్రూస్ స్కూల్ జట్టు 3-0తో పల్లవి మోడల్ స్కూల్ జట్టుపై, సెయింట్ మైకేల్ స్కూల్ జట్టు1-0తో సెయింట్ పాట్రిక్ స్కూల్‌పై గెలిచింది. ఈటోర్నీలో మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విష్రుద్ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్) గెలుచుకోగా,  మాన్ ఆఫ్ ది టోర్నీ నరేష్ (సెయింట్ ఆండ్రూస్ స్కూల్)లు గెలుచుకున్నాడు. ముగింపు వేడుకలకు రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. రఫత్ అలీ ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి ఫల్గుణ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement