భారత్‌కు టాప్ సీడింగ్ | India's top seeding | Sakshi
Sakshi News home page

భారత్‌కు టాప్ సీడింగ్

Sep 17 2015 1:58 AM | Updated on Sep 3 2017 9:31 AM

అంతర్జాతీయ చాలెంజ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత పురుషుల రికర్వ్ జట్టుకు టాప్ సీడింగ్ లభించింది. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు టెస్ట్

 రియో డి జనీరో: అంతర్జాతీయ చాలెంజ్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత పురుషుల రికర్వ్ జట్టుకు టాప్ సీడింగ్ లభించింది. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు టెస్ట్ ఈవెంట్‌గా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో రాహుల్ బెనర్జీ, జయంత తాలుక్‌దార్, మంగళ్ సింగ్ చాంపియాలతో కూడిన భారత జట్టు క్వాలిఫయింగ్‌లో 1996 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ బ్రెజిల్‌తో భారత్ తలపడుతుంది. దీపిక కుమారి, రిమిల్ బురిలీ, లక్ష్మీరాణి మాఝీలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు క్వాలిఫయింగ్‌లో 1894 పాయింట్లు స్కోరు చేసి 12వ సీడింగ్‌ను పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ మెక్సికోతో భారత్ ఆడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement