లక్ష్యఛేదనలో బరిలో దిగిన భారత్ | India batting in 5th oneday | Sakshi
Sakshi News home page

లక్ష్యఛేదనలో బరిలో దిగిన భారత్

Sep 5 2014 7:13 PM | Updated on Sep 2 2017 12:55 PM

ఇంగ్లండ్తో చివరి, ఐదో వన్డేలో భారత్ 295 లక్ష్యఛేదనలో బరిలోకి దిగింది.

లీడ్స్: ఇంగ్లండ్తో చివరి, ఐదో వన్డేలో భారత్ 295 లక్ష్యఛేదనలో బరిలోకి దిగింది. భారత ఓపెనర్లు రహానె, ధవన్ బ్యాటింగ్కు రాగా, రహానె డకౌటయ్యాడు.

శుక్రవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లకు 294 పరుగులు చేసింది. రూట్ (113) సెంచరీ చేసి ఇంగ్లండ్ను ఆదుకున్నాడు. బట్లర్ (49), కుక్ (46) రాణించారు. మొదట్లో ఇంగ్లండ్ నింపాదిగా ఆడినా, చివర్లో వేగంగా పరుగులు రాబట్టింది. షమీ రెండు, భువనేశ్వర్, ఉమేష్, అశ్విన్, రైనా తలా వికెట్ తీశారు.

వన్డే సిరీస్ను ధోనీసేన 3-0తో గెల్చుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి మూడు వన్డేల్లో భారత్ ఘనవిజయాలు నమోదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement