
నాగపూర్: తన తమ్ముడు హార్దిక్ పాండ్యా అన్నంత పని చేశాడంటున్నాడు క్రికెటర్ కృనాల్ పాండ్యా. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అతడు వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లో హార్దిక్ అద్భుతంగా ఆడి సత్తా చాటాడు. బ్యాటు, బంతితో రాణించి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ దక్కించుకున్నాడు. అయితే సిరిస్‌కు ముందు కృనాల్‌తో తన తమ్ముడు ఒక మాట అన్నాడట.
‘ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌ల్లో విజృంభిస్తానని సిరీస్‌కు ముందు హార్దిక్ పాండ్యా నాతో అన్నాడు. అన్నట్టుగానే మాట నిలుపుకున్నందుకు నేను గర్వపడుతున్నాన’ని కృనాల్ పాండ్యా ట్వీట్ చేశాడు. తనకు వచ్చిన ట్రోఫీలతో హార్దిక్ ఫోజిచ్చిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో హార్దిక్ 55.50 సగటుతో 222 పరుగులు సాధించాడు. 6.06 ఎకానమీ రేటుతో 6 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ అంచనాలకు మించి రాణించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లి అతడిని పొగడ్తల్లో ముంచెత్తాడు. టీమిండియాకు అతడిని పెద్ద ఆస్తిగా వర్ణించాడు.
Just before the #INDvAUS series, @hardikpandya7 told me he will set the stage on fire & today I can proudly say, “you did it... and how!”🇮🇳 pic.twitter.com/ORoYAwAhWz
— Krunal Pandya (@krunalpandya24) October 1, 2017