అరోన్‌ ఫించ్‌ను తప్పించారు.. | Finch out, Stoinis in for Kings Punjab | Sakshi
Sakshi News home page

అరోన్‌ ఫించ్‌ను తప్పించారు..

May 4 2018 7:51 PM | Updated on May 4 2018 8:18 PM

Finch out, Stoinis in for Kings Punjab - Sakshi

ఇండోర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శుక‍్రవారం ఇక్కడ హోల్కర్‌ క్రికెట్‌ స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌.  ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదింట విజయం​ సాధించగా, ముంబై ఎనిమిది మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. ప్రస్తుతం పంజాబ్‌ నాల్గో స్థానంలో కొనసాగుతుండగా, ముంబై ఇండియన్స్‌ చివరి స్థానంలో ఉంది. దాంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ముంబై ప్లే ఆఫ్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమే.  

ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. అరోన్‌ ఫించ్‌, మనోజ్‌ తివారీ, బరిందర్‌ శ్రాన్‌లు పక్కకు పెట్టేసింది. వారి స్థానాల్లో స్టోయినిస్‌, యువరాజ్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌లు తుది జట్టులో అవకాశం దక్కించుకున్నారు. మరొకవైపు ముంబై ఇండియన్స్‌ కీరోన్‌ పొలార్డ్‌ను తప్పించింది. అతని స్థానంలో ఎవిన్‌ లూయిస్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.

తుదిజట్లు

ముంబై ఇండియన్స్‌ 
రోహిత్‌ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్‌ యాదవ్‌, ఎవిన్‌ లూయిస్‌, ఇషాన్‌ కిషాన్‌, జేపీ డుమినీ, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, జస్ప్రిత్‌ బుమ్రా, మయాంక్‌ మార్కండే, మిచెల్‌ మెక్‌గ్లాన్‌, బెన్‌ కట్టింగ్‌

కింగ్స్‌ పంజాబ్‌ 
రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), లోకేశ్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌‌, మార్కస్‌ స్టోయినిస్‌, యువరాజ్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, ఆండ్రూ టై, అంకిత్‌ రాజ్‌పుత్‌, ముజీబ్ ఉర్ రహ్మాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement