యువరాజ్ను విస్మరిస్తారా? | Fans tweet their disappointment over Yuvraj Singh's exclusion | Sakshi
Sakshi News home page

యువరాజ్ను విస్మరిస్తారా?

Jan 7 2015 3:45 AM | Updated on Sep 2 2017 7:19 PM

యువరాజ్ను విస్మరిస్తారా?

యువరాజ్ను విస్మరిస్తారా?

వన్డే ప్రపంచ కప్ జట్టులో భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు చోటు కల్పించకపోవడంపై అతని అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోల్కతా: వన్డే ప్రపంచ కప్ జట్టులో భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు చోటు కల్పించకపోవడంపై అతని అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యువరాజ్ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం బీసీసీఐ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. సెలెక్టర్లు మరో ఆల్ రౌండర్ జడేజాను జట్టులోకి తీసుకుని యువీకి మొండిచేయి చూపారు. స్వదేశంలో జరిగిన గత ప్రపంచ కప్లో భారత్ విజయంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఈసారి యువీని పక్కనబెట్టి ఆయన సేవలను, అనుభవాన్ని కోల్పోయిందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. యువీ లేని జట్టును ఊహించలేకపోతున్నామని మరో అభిమాని ట్వీట్టర్లో పేర్కొన్నాడు. భారత జట్టు బలహీనంగా ఉందని, ఆస్ట్రేలియాలో బౌలర్లు తేలిపోతున్నారని ఇంకో అభిమాని విమర్శించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement