వరల్డ్ కప్కు 229 పరుగులు.. | england set target of 229 runs against india | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్కు 229 పరుగులు..

Jul 23 2017 6:40 PM | Updated on Sep 5 2017 4:43 PM

వరల్డ్ కప్కు 229 పరుగులు..

వరల్డ్ కప్కు 229 పరుగులు..

మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ఇంగ్లండ్ 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

లండన్: మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ఇంగ్లండ్ 229 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ను భారత్ కట్టడి చేసి సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. ఇంగ్లండ్ క్రికెటర్లలో ఓపెనర్లు విన్ ఫీల్డ్డ్(24), బీమాంట్(23)లు ఫర్వాలేదనిపించగా, సారా టేలర్(45), స్కీవర్(51)లు రాణించారు.  చివర్లో బ్రంట్(34), జెన్నీ గన్(25 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడటంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 228 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గోస్వామి మూడు వికెట్లు సాధించగా, పూనమ్ యాదవ్ రెండు వికెట్లు లభించాయి. ఇక గైక్వాడ్ ఒక వికెట్ తీశారు.


ఆదుకున్న టేలర్-స్కీవర్

తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ ఆదిలో కుదురుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు విన్ ఫీల్డ్-బీమాంట్లు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుపై రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. ఈ జోడి తొలి వికెట్ భాగస్వామ్యానికి 47 పరుగుల వద్ద బ్రేక్ పడింది. విన్ ఫీల్డ్ ను గైక్వాడ్ అవుట్ చేసి శుభారంభం ఇచ్చింది. ఆపై 60 పరుగుల వద్ద బీమాంట్ కూడా అవుట్ కాగా, ఇక కెప్టెన్ హీథర్ నైట్(1) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరింది. ఆ తరుణంలో టేలర్-స్కీవర్లు జోడి ఆదుకుంది.  వీరిద్దరూ దాటిగా బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లండ్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ 83 పరుగుల్నిజత చేసి పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో ఇంగ్లండ్ తేరుకుంది.


మెరిసిన జులన్..

భారత జట్టు ప్రధాన పేసర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిజం చేసింది. ఇంగ్లండ్ అత్యంత నిలకడగా ఆడుతున్న సమయంలో జులాన్ వరుసగా రెండు వికెట్లు తీసి మంచి బ్రేక్ ఇచ్చింది. ముందు మంచి టచ్ లో ఉన్న సారా టేలర్ ను అవుట్ చేసిన జులన్.. ఆపై మరసటి బంతికే ఫ్రాన్ విల్సన్ పెవిలియన్ కు పంపింది. అటు తరువాత  కొద్ది సేపటికీ హాఫ్ సెంచరీ చేసిన స్కీవర్(51) ను ఎల్బీగా అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ను నింపింది. తన 10 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ లో జులన్ మూడు మెయిడిన్లు సాయంతో 23 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement