గౌతం గంభీర్‌కు అరుదైన గౌరవం | DDCA Set To Name Gautam Gambhir's Stand | Sakshi
Sakshi News home page

గౌతం గంభీర్‌కు అరుదైన గౌరవం

Nov 21 2019 10:56 AM | Updated on Nov 21 2019 10:57 AM

DDCA Set To Name Gautam Gambhir's Stand - Sakshi

ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ క్రికెట్‌ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు గంభీర్‌ పేరు పెట్టాలని ఢిల్లీ, డిస్ట్రిక్ట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) నిర్ణయించింది. భారత జట్టుకు ఎన్నో సేవలందించిన ఈ ఢిల్లీ ఆటగాడికి ఒక గుర్తింపు ఇవ్వడానికి డీడీసీఏ సమాయత్తమైంది. దానిలో భాగంగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు గంభీర్‌ పేరును దాదాపు ఖరారు చేసింది.

ఈ మేరకు వచ్చే నెలలో గంభీర్‌ పేరుతో స్టాండ్‌ ఏర్పాటు కానుంది. జూనియర్‌, సీనియర్‌ స్థాయిలో ఢిల్లీ తరఫున గంభీర్‌ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. 2018లో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ తరఫున చివరి మ్యాచ్‌ ఆడుతూనే గంభీర్‌ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. 1999 సీజన్‌లో గంభీర్‌ రంజీ ట్రోఫీ అరంగేట్రాన్ని  ఢిల్లీ తరఫున ఆరంభించాడు. అలా టెస్టు ఫార్మాట్‌లోకి అడుగుపెట్టి భారత్‌ తరఫున 9 ఏళ్ల క్రికెట్‌ ఆడాడు. 2007-08 సీజన్‌లో అతని సారథ్యంలోని ఢిల్లీ రంజీ ట్రోఫీ అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement