గత నెల 14న ఆరంభమైన వన్డే ప్రపంచ కప్లో లీగ్ దశ ముగిసింది. లీగ్ దశలో మొత్తం 42 మ్యాచ్లు జరిగాయి. ఒక్క మ్యాచ్ మినహా అన్ని లీగ్ మ్యాచ్ల్లో ఫలితాలు వెలువడ్డాయి.
గత నెల 14న ఆరంభమైన వన్డే ప్రపంచ కప్లో లీగ్ దశ ముగిసింది. లీగ్ దశలో మొత్తం 42 మ్యాచ్లు జరిగాయి. ఒక్క మ్యాచ్ మినహా అన్ని లీగ్ మ్యాచ్ల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది.
గ్రూపు-ఎ టాపర్ న్యూజిలాండ్, గ్రూపు-బి టాపర్ భారత్ అన్ని మ్యాచ్లలో విజయం సాధించి క్వార్టర్స్కు అర్హత సాధించగా, స్కాట్లాండ్, యూఏఈ బోణీ కూడా కొట్టలేకపోయాయి. ఈ రెండు జట్లు ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఓటమి చవిచూసి ఇంటిదారిపట్టాయి. అఫ్ఘానిస్థాన్, జింబాబ్వే జట్లు ఒక్కో మ్యాచ్లో మాత్రమే నెగ్గాయి. గ్రూపు-ఎలో ఇంగ్లండ్ నాకౌట్కు అర్హత సాధించలేకపోయింది. లీగ్ దశలో నిష్ర్కమించిన అగ్రశ్రేణి జట్టు ఒక్క ఇంగ్లండ్ మాత్రమే. లీగ్ దశలో జట్ల వారీగా గెలుపోటముల వివరాలు పట్టికలో..