‘చెక్‌’ టోర్నీలో స్నేహిత్‌కు కాంస్యం | Sakshi
Sakshi News home page

‘చెక్‌’ టోర్నీలో స్నేహిత్‌కు కాంస్యం

Published Tue, Feb 20 2018 1:25 AM

check tournament:snehith  Bronze medal win  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చెక్‌ ఓపెన్‌ అంతర్జాతీయ జూనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సూరావజ్జుల స్నేహిత్‌ సభ్యుడిగా ఉన్న భారత బాలుర జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. టీమ్‌ ఈవెంట్‌ సెమీఫైనల్లో భారత్‌ 1–3తో జపాన్‌ చేతిలో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో స్నేహిత్‌ 7–11, 4–11, 11–7, 6–11తో సోనె కకెరు చేతిలో... రెండో సింగిల్స్‌లో మానవ్‌ ఠక్కర్‌ 7–11, 5–11, 11–8, 6–11తో షినోజుకు హిరోటో చేతిలో ఓడిపోగా... మూడో సింగిల్స్‌లో జీత్‌ చంద్ర 11–9, 11–5, 11–4తో హమాడా కజుకిపై గెలుపొందాడు. అయితే రివర్స్‌ సింగిల్స్‌లో మానవ్‌ ఠక్కర్‌ 6–11, 11–8, 11–7, 8–11, 5–11తో సోనె కకెరు చేతిలో పరాజయం పొందడంతో భారత ఓటమి ఖాయమైంది.

క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–1తో హంగేరిని ఓడించింది. ఈ పోటీలో తన సింగిల్స్‌ మ్యాచ్‌లో స్నేహిత్‌ 11–9, 11–6, 4–11, 13–11తో ఆండ్రాస్‌ సబాపై గెలుపొందాడు. ‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. చైనా, జపాన్‌ క్రీడాకారులకు దీటుగా ఆడాలంటే నేను చాలా శ్రమించాల్సి ఉంటుంది. మార్చిలో పరీక్షలు ముగిశాక ప్రాక్టీస్‌ సమయాన్ని మరింతగా పెంచి అంతర్జాతీయ టోర్నీలకు సమాయత్తమవుతాను’ అని 17 ఏళ్ల స్నేహిత్‌ వ్యాఖ్యానించాడు. గత ఎనిమిది నెలల కాలంలో స్నేహిత్‌ అంతర్జాతీయ స్థాయిలో ఏడు పతకాలు సాధించగా.. అందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి.    

Advertisement

తప్పక చదవండి

Advertisement