ఇదేమి బ్యాటింగ్‌రా నాయనా..! | Bailey's Bizarre Batting Stance Leaves Fans Bewildered | Sakshi
Sakshi News home page

ఇదేమి బ్యాటింగ్‌రా నాయనా..!

Nov 3 2019 2:12 PM | Updated on Nov 3 2019 2:30 PM

Bailey's Bizarre Batting Stance Leaves Fans Bewildered - Sakshi

హోబార్ట్‌: జార్జ్‌ బెయిలీ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన అతి కొద్దికాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్‌ తరఫున చివరిసారి ఆడిన బెయిలీ. 2016, డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకూ జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌ ఆడుతూనే ఉన్నాడు బెయిలీ. కాగా, ఇటీవల షెఫీల్డ్‌  షీల్డ్‌ ట్రోఫీలో భాగంగా తస్మానియా తరఫున ఆడిన బెయిలీ మరొకసారి వార్తల్లో నిలిచాడు. గురువారం విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో బెయిలీ తన బ్యాటింగ్‌ శైలితో హాట్‌ టాపిక్‌ అయ్యాడు.

తస్మానియా ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌లో బెయిలీ మొత్తం వికెట్లను కవర్‌ చేసి ఆడటం అభిమానుల్లో నవ్వులు పూయించింది. అటు బౌలర్లను, ఇటు చూసే వాళ్లను బెయిలీ తన బ్యాటింగ్‌ తికమకపెట్టాడు.  ఇదేం బ్యాటింగ్‌రా నాయనా అనుకునేంతగా బెయిలీ తన శైలితో మరి కాస్త వినోదాన్ని తీసుకొచ్చాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ సెటైర్లు వేస్తున్నారు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన బెయిలీ.. రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేశాడు.బెయిలీ ప్రాతినిథ్యం వహించిన తస్మానియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.

జార్జ్‌ బెయిలీ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన అతి కొద్దికాలంలోనే జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఆసీస్‌ తరఫున చివరిసారి ఆడిన బెయిలీ. 2016, డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకూ జాతీయ జట్టుకు మళ్లీ ప్రాతినిథ్యం వహించలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌ ఆడుతూనే ఉన్నాడు బెయిలీ. కాగా, ఇటీవల షెఫీల్డ్‌  షీల్డ్‌ ట్రోఫీలో భాగంగా తస్మానియా తరఫున ఆడిన బెయిలీ మరొకసారి వార్తల్లో నిలిచాడు. గురువారం విక్టోరియాతో జరిగిన మ్యాచ్‌లో బెయిలీ తన బ్యాటింగ్‌ శైలితో హాట్‌ టాపిక్‌ అయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement