వెరైటీ ఫొటోషూట్‌..కంగ్రాట్స్‌!! | Georgia Phd Scholar Woman Variety Photoshoot With Her Thesis | Sakshi
Sakshi News home page

నాకు ఇప్పుడు 66వ నెల; డాక్టర్‌ అవుతారులెండి!

Jun 7 2019 9:09 AM | Updated on Jun 7 2019 9:11 AM

Georgia Phd Scholar Woman Variety Photoshoot With Her Thesis - Sakshi

ప్రస్తుతం ఫొటోషూట్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. సందర్భం ఏదైనా సరే తమ ఆనందపు క్షణాలను కెమెరాలో బంధించడం నిత్యకృత్యమైపోయింది. ముఖ్యంగా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా భావించే పెళ్లి సమయంలో ఈ సందడి మామూలుగా ఉండదు. అయితే ఇటీవల కాలంలో సెలబ్రిటీలు, సామాన్యులు అని తేడా లేకుండా మహిళలంతా బేబీ బంప్‌ ఫొటోషూట్‌లతో హల్‌చల్‌ చేస్తున్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ ఆ ఙ్ఞాపకాలను పదిలపరచుకుంటున్నారు. జార్జియాకు చెందిన సారా వీలెన్‌ కర్టిస్‌ అనే మహిళ కూడా ఇలాంటి ఫోటోషూట్‌తో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫేమస్‌ అయ్యారు.

అయితే ఒక విషయం... మీరు అనుకుంటున్నట్టుగా సారా గర్భవతి కాదు.. కానీ ఆమె చేసింది మాత్రం బేబీ బంప్‌ షూటే. ఏంటి అదెలా సాధ్యం అనుకుంటున్నారా...అవును..తను బిడ్డలా భావించే పీహెచ్‌డీ థీసిస్‌తో ఆమె ఫొటోషూట్‌ నిర్వహించారు. ‘ నేను నా థీసిస్‌తో ఫొటోషూట్‌ చేశాను. లాంగెస్ట్‌ లేబర్‌ ఎవర్‌’ అని ట్వీట్‌ చేసి.. పీహెచ్‌డీ లైఫ్‌ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. వినూత్నంగా ఉన్న ఆమె ట్వీట్‌కు 66 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ క్రమంలో ‘  అవును పీహెచ్‌డీ చేయడం అంటే బిడ్డను కనడం కంటే తక్కువేమీ కాదు. నాకు ఇప్పుడు 66 వ నెల. ఇంకెప్పుడు పూర్తవుతుందో’ అంటూ ఓ పీహెచ్‌డీ స్కాలర్‌ కామెంట్‌ చేశాడు. ఇక మరికొంత మంది..‘ కంగ్రాట్స్‌. సాధారణంగా డాక్టర్లు.. తల్లి చేతిలో బిడ్డను పెడతారు. కానీ మీరు మాత్రం బిడ్డ పుట్టాక డాక్టర్‌ అవుతారు’ అని చమత్కరిస్తున్నారు. ఇంతకీ సారా పరిశోధన చేస్తున్న అంశం ఏంటంటే.. ఎపిజెనెటిక్‌ వేరియేషన్‌ అండ్‌ ఎక్స్‌పోజర్‌ టు ఎండోక్రిన్‌ డిస్రప్టింగ్‌ కాంపౌండ్స్‌(DNA క్రమంలో మార్పులు కాకుండా జన్యు సమాసంలో సంభవించే సంక్రమిత మార్పులు-వాటికి దారితీసే అంశాలు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement