వెరైటీ బౌలర్‌.. బెస్ట్‌ క్యాచ్‌

Creative Cricket video viral in Social media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : క్రికెట్‌కు క్రియేటివిటీకి ఇప్పుడునున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. మరీ అవి రెండు కలిపి ఓ వీడియో తీస్తే .. ఇంకే ముంది ఫుల్లుగా షేర్లు, లైకులు, కామెంట్లే. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

కొందరు క్రికెట్‌ ప్రేమికులు తమ ఆటకు క్రియేటివిటీ జోడించి ఓ వీడియో​ రూపొందించారు. బౌలరే బంతిలా మారి బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడమే ఈ కాన్సెప్ట్‌. ఓ బుడతడు బౌలింగ్‌ వేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాట్స్‌మెన్‌ బ్యాట్‌ మీద అడుగేసి స్లిప్‌లో ఉన్న మరో బాలుడి చేతుల్లోకి నేరుగా దూకేస్తాడు. వెంటనే బ్యాట్స్‌ మెన్‌ బ్యాట్‌ నేలమీద పడేసి అవుటయిన వాడిలా క్రీజ్‌లో నుంచి నిష్క్రమిస్తాడు. దీనికి తోడు ఆటగాళ్లంతా సంబరాలు చేసుకోవడం, బ్యాక్‌ గ్రౌండ్‌లో వికెట్‌ పడింది అంటూ వచ్చే కామెంట్రీ అందరికీ నవ్వులు తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా.. బాగా నచ్చింది, టాలెంటెడ్‌ బౌలర్‌ అంటూ కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ అంటూ హీరో మంచు మనోజ్‌ సరదాగా కామెంట్‌ పెట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top