కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికి... | Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter | Sakshi
Sakshi News home page

'మాటల్లో కాదు, చేతల్లో చూపే పార్టీ వైఎస్సార్‌సీపీ'

Jun 22 2020 12:00 PM | Updated on Jun 22 2020 12:00 PM

Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులివి. చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20-30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ. మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి. ఏమిటీ పరాభవం' అంటూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: మీ ఎమ్మెల్యేలే ఛీకొట్టి మీకు ఓటేయలేదు..

కాగా మరో ట్వీట్‌లో.. కరోనా కష్ట కాలంలోనూ మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్నారు యువ ముఖ్యమంత్రి. 80 వేలకు పైగా నేతన్నల కుటుంబాలకు లబ్ది. జగన్ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రారంభం. ఆర్నెల్లు ముందుగానే నేతన్నల ఖాతాల్లో డబ్బు జమ. మాటల్లో కాదు, చేతల్లో చూపే నిజమైన బడగుల పార్టీ వైఎస్సార్‌సీపీ' అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. చదవండి: టీడీపీ దౌర్జన్యం.. ఎమ్మెల్యేతో కలిసి ఫిర్యాదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement