వైఎస్సార్‌ సీపీ నేతలపై  టీడీపీ వర్గీయుల దాడి

Police Harassed YSRCP Leaders In Nandyal - Sakshi

సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లాలోని నంద్యాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్‌ సీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు సుబ్బరాయుడుపై దాడి చేయడమే కాకుండా అతనిపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారు . ఎమ్మెల్యే ఒత్తిడితో సుబ్బరాయుడుతో పాటు మరో ముగ్గురికిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా విచారణ పేరుతో వైఎస్సార్‌ సీపీ నేతలను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. 

దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. పోలీసులు బాధితులపై కేసు నమోదు చేయడం పట్ల వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడుతున్నారు. పక్షపాతం లేకుండా వ్యవహారించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా మెలగడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top