అవినీతి రహిత సమాజమే సీఎం ధ్యేయం: అవంతి

Minister Avanthi Srinivasa Rao Attend A Programme In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అవినీతి రహిత సమాజమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నర్సీపట్నంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నియోజకవర్గ గ్రామ స్థాయి వాలంటీర్‌, వార్డ్‌ వాలంటీర్‌ల పరిచయ వేదికను అవంతి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చేసిన తప్పులు చేయోద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వం కృత్రిమ వరదలను సృష్టించిందనడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని మంత్రి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలోనే లక్షల ఉద్యోగాలు చూపెట్టిన ఘనత వైఎస్‌ జగన్ ప్రభుత్వానిదని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top