కుట్ర బయడపడుతుందని టీఆర్ఎస్‌లో భయం

Laxman Criticises CM KCR Government Ruling - Sakshi

సాక్షి, హైదరాబాద్: కాగ్ నివేదికతో టీఆర్ఎస్ సర్కార్ డొల్లతనం బయటపడిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా మిగులు బడ్జెట్ అని ప్రచారం చేశారని మండిపడ్డారు. లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. నాలుగేళ్లు కావస్తున్నా వెయ్యి సరిపడా ఇండ్లు కూడా నిర్మించలేదని తెలిపారు. కాగ్ నివేదికను చివరి నిమిషంలో అసెంబ్లీలో బయటపెట్టి సభలో చర్చకు రాకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. చివరి నిమిషంలో ప్రవేశపెట్టి కాగ్ నివేదికను టీఆర్ఎస్ సర్కార్ చర్చకు రాకుండా జాగ్రపడ్డా.. బీజేపీ మాత్రం ఆ నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నారు. ఉన్నదంతా పంచితే.. పంచే ఊడిపోయే పరిస్థితి వస్తుందని చెబితే మమ్మల్ని అపహాస్యం చేశారు. కానీ కాగ్ నివేదికలో అదే నిజమని తేలింది. టీఆర్ఎస్ చేసిన మోసాలు, చెయ్యకూడని పనులు ఎలా ఉన్నాయో అందులో స్పష్టంగా ఉంది. గొప్పలకు పోయి వివిధ సంస్థల నుండి అప్పుతెచ్చి మీ ఆస్తులుగా చూపడమే సర్కార్ దిగజారుడు తనానికి నిదర్శనం. పైగా అప్పులు చేయని రాష్ట్రమే లేదంటూ బీరాలు పలికారు. ఓట్లు రాబట్టే ప్రయత్నమే తప్ప, అభివృద్ధి, సంక్షేమం అనే విషయాలను పట్టించుకోలేదు.

లక్షల డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ కేవలం 1000 ఇండ్లు కూడా పూర్తి చేయలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మిషన్ కాకతీయలో పనులన్నీ నత్త నడకన సాగుతున్నాయి. సకాలంలో రుణాలు ఇవ్వకపోవడంతో 15 లక్షల మంది రైతులు నష్టపోయారు. ఇన్నేళ్లయినా మిషన్ భగీరథ ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. బడి మానేస్తున్న పిల్లల సంఖ్య తగ్గిపోతున్న సర్కార్ పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు తగ్గాయి. కానీ కేసీఆర్ కిట్స్ వచ్చాక పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట తప్పవని కాగ్ నివేదిక తేల్చింది. 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు తగ్గాయి..కేసీఆర్ కిట్స్ వచ్చాక పెరిగాయన్నారు...తప్పని కాగ్ చెప్పింది..

యూనివర్సిటీల్లో నియామకాలు లేవు. టెంటులు లేదు.. ఫ్రంట్‌లు లేవు. ఓటమి పార్టీలన్నీ గుంపుగా మారుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. నష్టాల్లో డిస్కంలను కేంద్ర ప్రభుత్వం ఆదుకున్నదని, ఉదయ్ స్కీం లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. బీజేపీ అన్ని వర్గాలతో కలిసి పనిచేస్తుంది. త్రిపుర, గుజరాత్‌లలో బీజేపీ గెలవదన్నారు. కానీ అధికారం హస్తగతం చేసుకున్నాం. వచ్చే కర్ణాటక ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక సర్కార్ మీద ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారు. బీజేపీ మాత్రం అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో నెగ్గుతుందని లక్ష్మణ్ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top