రాష్ట్రపతికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

KCR Sends Birthday Wishes to President Kovind

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌కు ఆయన పుష్పగుచ్ఛం పంపారు. రాష్ట్రపతి కోవింద్‌ నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యంతో జీవించాలని, దేశానికి మరిన్ని సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు.

గవర్నర్‌ను కలసిన సీఎం కేసీఆర్‌
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా ఉన్నారు.

Back to Top