‘రజనీ’రాడు... | BJP Leader PRK Invites in Party to Rajinikanth Tamil Nadu | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి రండి!

Oct 23 2019 7:44 AM | Updated on Oct 23 2019 7:44 AM

BJP Leader PRK Invites in Party to Rajinikanth Tamil Nadu - Sakshi

రజనీ

సాక్షి, చెన్నై : దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ బిజేపిలోకి రావాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రిపొన్‌ రాధాకృష్ణన్‌ పిలుపు నిచ్చారు. అయితే, ఆయన వచ్చేది లేదు..పార్టీ పెట్టబోయేది లేదని, అంతా ఆథ్యాత్మిక బాటే అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి  ఎద్దేవా చేశారు. తలైవా రాజకీయ ప్రకటన చేసి రెండేళ్లు నిండుతున్నది. అదిగో పార్టీ, ఇదిగో జెండా అంటూ ప్రచారాలు మాత్రం జోరుగానే సాగుతూ వస్తున్నది. అప్పుడప్పుడు  మక్కల్‌ మండ్రం వర్గాలతో తలైవా భేటీలు కావడం, బలోపేతం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లడం , సిద్ధాంతాలు, సూచనలు , సలహాలు, సభ్యత్వాలు అంటూ హడావుడి æ పరిణామాలతో ఇక, పూర్తిగారాజకీయాల్లోకి వచ్చేసినట్టే, పార్టీ ప్రకటించినట్టే అన్నట్టుగా పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అయితే,కథానాయకుడు ఎక్కడా చిక్కకుండా సినిమా షూటింగ్‌ల  బిజీ లో ఉంటూ, మీడియా  చుట్టుముట్టినప్పుడు ఏదో ఒక రాజకీయ వ్యాఖ్యో , ప్రకటన చేసి ఓ కలకలం, సంచలనాన్ని సృష్టించి వెళ్లడం పరిపాటిగా మారింది. అయితే,గత కొద్ది రోజులుగా బిజేపి పెద్దల నుంచి రజనీకి ఒత్తిడి అన్నది ఉన్నట్టుగా ప్రచారం జోరుగానే సాగుతున్నది. రజనీ కాంత్‌ బిజేపిలోకి రావాలని ఆ పెద్దలు పిలుపు నివ్వడమే కాదు, అందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టుగా సమాచారాలు హోరెత్తాయి. వీటన్నింటికి తాత్కాలిక ముగింపు పలికే రీతిలో మరో కొత్త చిత్రానికి సూపర్‌ స్టార్‌ సంతకం చేయడంతో రాజకీయం, పార్టీ ఇప్పట్లో లేనట్టే అన్నది స్పష్టం అవుతున్నది. అలాగే, ఐదు రోజల పాటుగా హిమాలయ ఆథ్యాత్మిక పర్యటన ముగించుకుని చెన్నైకు వచ్చిన తలైవా, దర్బార్‌ డబ్బింగ్‌ బిజిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.  రజనీ రూటే సపరేటు అన్నట్టుగా సాగుతున్న సమయంలో ఆయన బిజేపిలోకి రావాలని బహిరంగంగానే ఆ పార్టీ కి చెందిన సీనియర్‌ నేత , కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ మంగళవారం పిలుపు నివ్వడం మరో మారు రాజకీయ చర్చజోరందుకుంది.

రావాలి..రాడు....
మీడియాతో పొన్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ, రజనీ కాంత్‌ ఓ రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వస్తే, ఆహ్వానించడమే కాదు, శుభాకాంక్షలు తెలియజేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన లాంటి వారు సొంత పార్టీతో కాకుండా, బిజేపిలోకి వచ్చి రాజకీయ సేవ చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన బిజేపిలోకి రావాలని తాను పిలుపు నిస్తున్నాన్నట్టు ఆహ్వానించారు. ఆయన వస్తే ఆహ్వానం పలుకుతామన్న పొన్‌ రాధాకృష్ణన్, తామేమీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయడం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆయన బిజేపిలోకి రావాలన్నది తన ఆకాంక్ష అని, వస్తే బాగుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు బిజేపిలోకి రావాలని తాను ఆహ్వానం పలుకుతున్నట్టు వ్యాఖ్యానించారు.  ఇక, రజనికి ఓ నేత ఆహ్వానం పలికితే, మరో నేత రానే రాడని తేల్చి చెప్పేశారు. బిజేపి నేత వ్యాఖ్యలమీద రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి స్పందించారు. రజనీ కాంత్‌ ఆలోచనలే వైవిధ్యంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయాల్లోకీ రాడు..పార్టీనీ ప్రకటించడు అని స్పష్టం చేశారు. ఆయన ఇప్పుడు ఎలాంటి బాణిలో సాగుతున్నారో , అదే కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆయన బిజేపిలోకి చేరడమో లేదా, సొంత పార్టీ పెట్టడమో జరిగే ప్రసక్తే లేదన్నారు. ఆథ్యాత్మిక భావాల్ని కల్గిన వారు రాజకీయాలకు దూరంగా ఉంటారన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement