‘జాగ్రత్త! రాహుల్‌, ప్రియాంకలు అగ్గి రాజేస్తారు’ | Beware of Rahul Gandhi and Priyanka Vadra : Haryana Home Minister | Sakshi
Sakshi News home page

‘జాగ్రత్త! రాహుల్‌, ప్రియాంకలు అగ్గి రాజేస్తారు’

Dec 25 2019 8:33 AM | Updated on Dec 25 2019 12:51 PM

Beware of Rahul Gandhi and Priyanka Vadra : Haryana Home Minister - Sakshi

సాక్షి, చండీగఢ్‌ : కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలు పెట్రోల్‌ బాంబు వంటి వారని హర్యానా హోం మంత్రి పేర్కొన్నారు. మంగళవారం రాహుల్‌, ప్రియాంకలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే స్థానికంగా 144 సెక్షన్‌ విధించి ఉండడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా బీజేపీ హోం మంత్రి అనిల్‌ విజ్‌ ట్వీట్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లు ప్రాణాలతో ఉన్న పెట్రోల్‌ బాంబు లాంటి వాళ్లు. వారు అడుగుపెట్టిన చోట అగ్గి రాజేసి, ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమవుతారని ట్వీట్‌ చేశారు. చదవండిరాహుల్‌కు ప్రశాంత్‌ కిషోర్‌ అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement