చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట నుంచి మూడో రోజు ప్రారంభమైన సమైక్య శంఖారావం యాత్రకు జనం వేలాదిగా తరలివచ్చారు.
పలమనేరు నియోజకవర్గం వి.కోట నుంచి మూడో రోజు ప్రారంభమైన సమైక్య శంఖారావం యాత్రకు జనం వేలాదిగా తరలివచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వెంట నడిచారు. మిద్దెల పైనుంచి మహిళలు పూలవర్షం కురిపించారు. జననేతను కలిసిన వృద్ధులు తమ బాధలు చెప్పుకున్నారు. రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. అభిమాన నేతను చూసేందుకు దారి పొడవునా జనం బారులు తీరారు. మహానేత తనయుడు కనిపించగానే కరచాలనం కోసం చేతులు చాచారు. జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. సభలో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
భరోసా : నేనున్నా నీకేల భయం
అమ్మదీవెన: హారతులిచ్చి కుంకుమపెట్టి దీవిస్తున్న మహిళ
బెరైడ్డిపల్లెలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి మద్దతు పలుకుతున్న జనం
మురిపెం : జగన్‌ను చూసి మురిసిపోతున్న చిన్నారి
అక్కయ్యా : భవిష్యత్ మనదే బెంగ వద్దు
ఎదురుచూపు : జగన్ కోసం మిద్దెలెక్కి నిరీక్షిస్తున్న అభిమానులు
ఆత్మీయ కరచాలనం కోసం : కరచాలనం కోసం అభిమానుల తహతహ
ఈ కష్టాలు ఇంకెంతకాలం తండ్రీ.. : జగన్‌కు వృద్ధురాలి మొర
దిగులొద్దు: వికలాంగుడికి జగన్ భరోసా, జననేతను చూసి నమస్కరిస్తున్న ఓ వికలాంగుడు
పూలవాన: జగనన్నపై పూల వర్షం కురిపిస్తున్న యువతులు
ఆశీర్వాదం: చిన్నారిని ఆశీర్వదిస్తున్న జగన్
అయ్యో.. ఎంతకష్టం : బీన్‌స రైతుల బాధలను ఆలకిస్తూ..