అమ్మ తనములోని అనురాగమును పంచు | Telugu Mother Tongue Day Special | Sakshi
Sakshi News home page

అమ్మ తనములోని అనురాగమును పంచు

Feb 21 2014 12:49 AM | Updated on Sep 2 2017 3:55 AM

అమ్మ తనములోని అనురాగమును పంచు పొలుపైన కథలెన్నో తెలుగులోన నాన్నలా రక్షించి నవ్యనీతులు నేర్పు

"సీ "
అమ్మ తనములోని అనురాగమును పంచు
పొలుపైన కథలెన్నో తెలుగులోన
నాన్నలా రక్షించి నవ్యనీతులు నేర్పు
చెలువైన మణులెన్నొ తెలుగులోన
అన్నయ్య నీడగా అండగా నిలుచుండు
కొలువైన గతులెన్నో తెలుగులోన
అత్తయ్య తోడుగా చక్కగా అలరించు
విలువైన గనులెన్నో తెలుగులోన

"తే" గీ" ఎన్నొ కావ్యాల గేయాల ఇంపు సొంపు
ముగ్ధ మొహన భావాల మోహరింపు
తెలుగు భాషంటె జగతికే వెలుగు చూడ
వాణి వినిపించు తెలుగోడ ! వాడ వాడ
- తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా


పేరు :- చల్లా శ్రీనివాసరావు
తెలుగు పండిట్
నిజాంపేట, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement