
జయరాజు పాటలు-జ్ఞాపకాలు
పాటె నా ప్రాణము/ పాటె నా జీవితం అంటారు జయరాజు. కోట్లు కూడగట్టినా/ పాటకు సరితూగునా అని కూడా అంటారు. అందుకే ఆయన ప్రతి స్పందనా పాట రూపంలో వెల్లడైంది.
ఆవిష్కరణ
పాటె నా ప్రాణము/ పాటె నా జీవితం అంటారు జయరాజు. కోట్లు కూడగట్టినా/ పాటకు సరితూగునా అని కూడా అంటారు. అందుకే ఆయన ప్రతి స్పందనా పాట రూపంలో వెల్లడైంది. ప్రకృతి, పుడమి, కులం, మతం, ఆకలి, దరిద్రం, మమత, సమత, శ్రమ, నెత్తురు, వాన, వెన్నెల, జైలు, సింగరేణి, అమ్మ, నాయిన, పూలు, పూలే, బతుకమ్మ, అంబేడ్కర్... ఇలా అన్నీ పాటే, అంతా పాటే! ఆ పాటలమూట వసంతగీతంగా వెలువడింది.
జయరాజు గారి పాటలు అంత తీయగా ఉండటానికి కారణం, అవన్నీ, ఆయన జీవితంలో అనుభవించిన చేదులోంచి చేదుకున్న పాటలు. కేవలం ఏదో ఒక సందర్భంలో స్పందించి గుండెలో పల్లవించిన పాటల కూర్పు కాదు. శిశిర శరాఘాతాలకు పువ్వుల్ని రాల్చుకున్న తోటలాంటి తన జీవితాన్ని పాటగా మార్చుకుని రాసిన పాటల సంపుటే ఈ వసంతగీతం.
నేను ఒక పాలేరు కుటుంబం నుంచి వచ్చినవాన్ని. దొర, భూస్వాముల, పెట్టుబడిదారుల పథఘట్టాల క్రింద పడిలేసినవాన్ని. లాఠీలు, తూటాలు, జైలుగోడలు చవిచూచినవాన్ని. చావు అంచులవరకు వెళ్లి వచ్చినవాన్ని అంటారు జయరాజు. అట్లా తన స్థూల జీవిత ప్రయాణాన్నీ, ఆ ప్రయాణంలోని చిరు శకలాలనూ అందించే పుస్తకం జ్ఞాపకాలు.
ఈ రెండింటి ప్రచురణ: భూమి బుక్ ట్రస్ట్, ఎస్.ఆర్.టి. 267/1, జవహర్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, హైదరాబాద్–20; ఫోన్: 9849908929. రెండూ సెప్టెంబర్ 1న ఆవిష్కరణ కానున్నాయి.