ఢిల్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు | YSRCP anniversary celebrations in delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఘనంగా వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

Mar 12 2018 11:31 AM | Updated on Jun 4 2019 6:39 PM

YSRCP anniversary celebrations in delhi - Sakshi

ఢిల్లీలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సాక్షి, ఢిల్లీ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిలాగే వైఎస్‌ జగన్‌ విశ్వసనీయత కలిగిన నేత అని కొనియాడారు. 2019 ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ.. అనుకున్న లక్ష్యం కోసం వైఎస్‌ జగన్‌ దేనికి భయపడకుండా నిరతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో జగన్‌ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, పార్టీకి బం‍గారు భవిష్యత్తు ఉంటుందని మేకపాటి రాజామోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ విలువలు కలిగిన పార్టీ అని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉందని ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement