వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కట్నంకోసం భర్త, అత్తగారు పెట్టే నరకం భరించలేక ప్రాణాలు తీసుకుంది.
వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కట్నంకోసం భర్త, అత్తగారు పెట్టే నరకం భరించలేక ప్రాణాలు తీసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో వరకట్న వేధింపుల కేసు వెలుగు చూసింది.
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ జిల్లా బల్లబ్ ఘర్ ప్రాంతానికి చెందిన మహిళపై ఆమె భర్త రాహుల్ .. అత్త బెలిహర్ వేధింపులకు పాల్పడినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కట్నం కోసం తమ సోదరిని మానసికంగానూ, శారీరకంగానూ తీవ్రంగా హింసించారని, వేధింపులు తాళలేకే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు మంగళ్ దేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తరపు బంధువుల ఫిర్యాదు మేరకు సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఫరీదాబాద్ పోలీసులు వెల్లడించారు.