
జయలలిత
తమిళనాడు మాజీ సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన శాసనసభ నియోజకవర్గం ఖాళీ అయిందని పేర్కొంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ పంపారు.
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన శాసనసభ నియోజకవర్గం ఖాళీ అయిందని పేర్కొంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ పంపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె దోషిగా రుజువై శాసనసభ్యురాలిగా అనర్హతకు గురైనవిషయం తెలసిందే. ఈ నేపధ్యంలో శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీకి సంబందించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను శనివారం ముఖ్య ఎన్నికల అధికారికి పంపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
సెప్టెంబరు 27న నాలుగేళ్ల జైలు శిక్ష పడిన వెంటనే జయలలిత అనర్హతకు గురయ్యారు. కానీ, ఈ సీటును ఖాళీ అయినట్లుగా ఎన్నికల సంఘం పరిగణించేందుకు అసెంబ్లీ కార్యదర్శి నుంచి ఎన్నికల అధికారికి అధికారిక సమాచారం అందవలసి ఉంది.
**