
తిరువనంతపురం: విదేశాల్లో అయితే కేవలం వాహనాల వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ మన దేశంలో మాత్రం .. వర్షం పడినా, తాగి రోడ్డు మీదకొచ్చి రచ్చ చేసే ఘటనలు సహా ఏ చిన్న సంఘటన జరిగినా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడప్పుడు ఈ లిస్ట్‌లోకి జంతువులు కూడా చేరతాయి. జంతువులు రోడ్డు ఎక్కాయంటే ఎంత భారీ వాహనం అయినా సరే ఆగిపోవాల్సిందే. ఆవులు, గేదెలు రోడ్డు మీదకు వచ్చి ట్రాఫిక్ జామ్ సృష్టించడం మన దేశంలో సర్వ సాధారణంగా కనిపించే దృశ్యం.
కేరళలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రద్దీగా ఉండే రోడ్డు మీదకు బాతుల గుంపు ఒకటి రావడంతో.. కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పదుల సంఖ్యలో బాతులు రోడ్డు మీదకు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశాడు. అయితే ట్రాఫిక్ జామ్‌కు కారణమైనప్పటికీ బాతులు మనకు క్రమశిక్షణ నేర్పాయంటూ వాటిపై ప్రశంసలు కురిపించడం విశేషం.‘మనకంటే బాతులే నయం.. ఎంత క్రమశిక్షణగా రోడ్డు దాటాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
A different type of traffic jam in #Kerala #DuckTales pic.twitter.com/OP1hoghxuP
— Amush Booshe (@guffawer) July 25, 2019