వామ్మో ఇవేం టోల్ చార్జీలు.. మార్చండి: సచిన్ | Tendulkar speaks out against toll tax in Maharashtra | Sakshi
Sakshi News home page

వామ్మో ఇవేం టోల్ చార్జీలు.. మార్చండి: సచిన్

Mar 13 2015 10:44 PM | Updated on Oct 8 2018 5:45 PM

వామ్మో ఇవేం టోల్ చార్జీలు.. మార్చండి: సచిన్ - Sakshi

వామ్మో ఇవేం టోల్ చార్జీలు.. మార్చండి: సచిన్

ముంబై: మహారాష్ట్రలో వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్లపై క్రికెట్ లెజెండ్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రెండు పేజీల లేఖలను రాస్తూ అందులో టోల్ ట్యాక్స్లపై తన అభిప్రాయాలను రాశారు.

ముంబై: మహారాష్ట్రలో వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్లపై క్రికెట్ లెజెండ్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రెండు పేజీల లేఖలను రాస్తూ అందులో టోల్ ట్యాక్స్లపై తన అభిప్రాయాలను రాశారు. ' ముంబైలో సంబంధితశాఖ వసూలు చేస్తున్న రహదారుల పన్నులపై, విధివిధానాలపై నేను చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నాను.  టోల్ చార్జీలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇవి ముంబై ప్రజలను శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపెడుతున్నాయి. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు భరించగలిగేలా టోల్ చార్జీలను మరోసారి సంస్కరణలతో పునరుద్ధరించండి' అని పేర్కొన్నారు.

దీంతోపాటు వాహనాదారులు తేలికగా తమ గమ్యస్థానాలకు చేరుకునే ఏర్పాట్లు చేయండి అంటూ సచిన్ పలు విషయాలను లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ఆయన గత నెల 20న ఎంపీ లెటర్ ప్యాడ్పై రాసి పంపించగా అది తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ లేఖపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. సచిన్ పంపిన లేఖను పరిగణలోకి తీసుకొన్నామని త్వరలోనే చర్చించి చట్టాలకు అనుగుణంగా టోల్ చార్జీలను సంస్కరిస్తామన్నారు. అవసరం లేని చోట టోల్ ప్లాజాలను మూసివేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement