మూడు రోజులైనా జాడ లేని విమానం | Search For Missing Aircraft Continues | Sakshi
Sakshi News home page

మూడు రోజులైనా జాడ లేని విమానం

Jun 6 2019 8:15 AM | Updated on Jun 6 2019 8:15 AM

Search For Missing Aircraft Continues - Sakshi

విమానం గల్లంతు : కొండల్లో జల్లెడ పడుతున్నారు

న్యూఢిల్లీ : గత మూడు రోజులుగా ఆచూకీ లభించని ఐఏఎఫ్‌ ఏఎన్‌-32 విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 13 మంది సభ్యులతో కూడిన ఏఎన్‌-32 విమానం అసోంలోని జోర్హాట్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఆచూకీ గల్లంతైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా బేస్‌లో విమానం ల్యాండ్‌ కాకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినా ఇప్పటివరకూ విమానం జాడ పసిగట్టలేకపోయారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ సియోంగ్‌ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో పలు బృందాలు విమానం ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండటం‍తో పాటు ప్రతికూల వాతావరణం గాలింపు చర్యలకు అవరోధంగా మారాయి. హెలికాఫ్టర్లు, ఇస్రో శాటిలైట్లు, నేవీకి చెందిన పీ-8ఐ విమానం సహా పలు బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement