ఆ కొద్దిమంది కోసమే ప్రభుత్వం | Puri ki puri Hindustan ki sarkar 5-6 businessmen ke liye chalaayi jaa rahi hai: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఆ కొద్దిమంది కోసమే ప్రభుత్వం

Mar 5 2016 4:41 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఆ కొద్దిమంది కోసమే ప్రభుత్వం - Sakshi

ఆ కొద్దిమంది కోసమే ప్రభుత్వం

అసోం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజీపే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అసోం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం బీజీపే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కేవలం కొద్దిమంది వ్యాపారస్తుల కోసమే పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అసోంలోని నాగోంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా  కేవలం ఐదారుగురు బడా వ్యాపారవేత్తల కోసమే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని  రాహుల్ మండిపడ్డారు.


గురువారం లోక్‌సభలో దాదాపు గంటంపావు ప్రసంగించిన మోదీ.. తన తండ్రి రాజీవ్, నాయనమ్మ ఇందిరల మాటలను వల్లెవేశారే తప్ప, తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని రాహుల్ విమర్శించారు. తాను జేఎన్యూ, రోహిత్, మేకిన్ ఇండియా ఘటనల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. జేఎన్యూలో ఉన్న 8వేల మంది విద్యార్థుల్లో దాదాపు వెయ్యి మంది ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఉన్నారన్నారు. ఇపుడు వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. హిందువుల ఓట్లను రాబట్టేందుకు బీజేపీ పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతోందన్నారు. మోదీ వచ్చి అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని హామీలు ఇచ్చారు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ఓట్లు అడిగేందుకు వస్తున్న బీజేపీ నేతలను నిలదీయాలని రాహుల్ ప్రజలకు  పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement