
పంజాబ్‌లో ఉగ్ర కుట్రకు స్కెచ్..
చండీగఢ్ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఉగ్ర ముప్పు హెచ్చరికలతో పంజాబ్ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను ముమ్మరం చేసిన అధికారులు వివిధ జోన్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పంజాబ్‌లో జైషే, లష్కరే ఉగ్ర మూకలు ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని పంజాబ్ ప్రభుత్వానికి సమాచారం అందడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇండో-పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఉగ్రవాదుల కదలికలు ముమ్మరంగా సాగాయని గత వారం నిఘా వర్గాలకు ఉప్పందింది. నిఘా సంస్థల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై జిల్లా పోలీస్ అధికారులకు నిర్ధిష్ట సూచనలు జారీచేసింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర కుట్రలను భగ్నం చేసేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితిని సీనియర్ పోలీస్ అధికారులతో సీఎం సమీక్షించారు.