తండ్రిని స్మరిస్తూ.. ప్రియాంక భావోద్వేగం

Priyanka Gandhi Tweets What She Learned From Her Father - Sakshi

న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయన కుమార్తె ప్రియాంక గాంధీ ఓ భావోద్వేగపూరిత సందేశాన్ని ట్వీట్‌ చేశారు. ‘మా నాన్న నాకు ఎప్పుడు ఒకటే చెప్పేవారు. మార్గం ఎంత కష్టంగా ఉన్నా సరే.. జనాల కష్టాలు తెలుసుకుంటూ చిరునవ్వుతో ముందుకు సాగిపో’ అంటూ తండ్రితో కలిసి ఉన్న ఫోటోతో పాటు ఓ కవితను కూడా ట్వీట్‌ చేశారు. ప్రియాంక చేసిన ట్వీట్‌ ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతోంది.
 

రాజీవ్‌ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రియాంక. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నా తండ్రి నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇతరుల కష్టాలను విని హృదయంతో స్పందిచడం.. ఎంత కష్టమైనప్పటికి నచ్చిన మార్గంలో పయనించడం వంటి లక్షణాలను నా తండ్రి నుంచే అలవర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక రాహుల్‌ గాంధీ తన తండ్రిని ఉద్దేశిస్తూ.. ‘గొప్ప వీరుడు మాత్రమే కాక గొప్పగా ప్రేమించే తండ్రి’ అంటూ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top