ట్విటర్ లో దేశ ప్రథమ పౌరుడు! | President makes debut on Twitter | Sakshi
Sakshi News home page

ట్విటర్ లో దేశ ప్రథమ పౌరుడు!

Jul 1 2014 7:27 PM | Updated on Sep 2 2017 9:39 AM

ట్విటర్ లో దేశ ప్రథమ పౌరుడు!

ట్విటర్ లో దేశ ప్రథమ పౌరుడు!

సోషల్ మీడియా ప్రపంచంలోకి భారత దేశ తొలి పౌరుడు ప్రణబ్ ముఖర్జీ అడుగుపెట్టారు.

న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్రపంచంలోకి భారత దేశ తొలి పౌరుడు ప్రణబ్ ముఖర్జీ అడుగుపెట్టారు. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ప్రణబ్ ముఖర్జీ తన అకౌంట్ ఆరంభించారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక నుంచి రెగ్యులర్ గా రాష్ట్రపతి తన కార్యక్రమాలను, వార్తలను ట్వీట్ చేస్తారని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. @RashtrapatiBhvn పేరిట రాష్ట్రపతి ట్విటర్ అకౌంట్ ను ఆరంభించారు. 
 
మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా ప్రారంభించిన ట్విటర్ అకౌంట్ లో ఇప్పటికే 10 వేలకు పైగా ఫాలోవర్స్ చేరిపోయారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రజలకు రాష్ట్రపతి ట్విటర్ ద్వారా చేరువవుతారని రాష్టపతి భవన్ వెల్లడించింది. ఇప్పటికే రాస్ట్రపతి ఫేస్ బుక్ ద్వారా తన సందేశాల్ని ప్రజలతో పంచుకుంటున్నారు. తాజాగా జాతీయ అవార్డు గ్రహీత అవార్డు, శిల్పగురు అవార్డు, సంత్ కబీర్ అవార్డుల వివరాలను ట్విటర్ లో పోస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement