ఇకపై హిందీలోనూ పాస్‌పోర్టు: సుష్మ | Passport in Hindi: Sushma | Sakshi
Sakshi News home page

ఇకపై హిందీలోనూ పాస్‌పోర్టు: సుష్మ

Jun 24 2017 3:27 AM | Updated on Sep 5 2017 2:18 PM

ఇకపై హిందీలోనూ పాస్‌పోర్టు: సుష్మ

ఇకపై హిందీలోనూ పాస్‌పోర్టు: సుష్మ

పాస్‌పోర్టులో వ్యక్తిగత వివరాలను ఇకపై హిందీలోనూ ఇవ్వనున్నారు.

న్యూఢిల్లీ: పాస్‌పోర్టులో వ్యక్తిగత వివరాలను ఇకపై హిందీలోనూ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు కేవలం ఆంగ్లం లోనే ఈ వివరాలను ఇస్తున్నారు. అలాగే పాస్‌పోస్టు ఫీజులో 8 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వారికి 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఇది నేటి నుంచే అమల్లోకి రానుంది. పాస్‌పోర్టు దరఖాస్తులో అనవసర డాక్యుమెంట్ల ను తొలగిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ వెల్లడించారు.

తత్కాల్‌ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్న వారు పాన్‌కార్డు లేనిపక్షం లో తప్పకుండా రేషన్‌ కార్డును సమర్పించాల్సి ఉంటుందన్నారు. పాస్‌పోర్టు యాక్ట్, 1967 అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె పోస్టల్‌ స్టాంప్‌ను విడు దల చేశారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, గోవాల్లో 6రోజుల్లోనే పోలీస్‌ విచారణ పూర్తి చేస్తున్నారని, అది మిగతా రాష్ట్రాలూæ పాటించాలని సూచించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement