వివక్షను భరించా.. విజయం సాధించా: పద్మిని | Padmini Prakash travels against odd to achieve her goals | Sakshi
Sakshi News home page

వివక్షను భరించా.. విజయం సాధించా: పద్మిని

Sep 21 2014 3:03 PM | Updated on Sep 2 2017 1:44 PM

వివక్షను భరించా.. విజయం సాధించా: పద్మిని

వివక్షను భరించా.. విజయం సాధించా: పద్మిని

తల్లి తండ్రుల ఆదరణకు నోచుకోలేకపోయినా ఆమెలో ఆత్మవిశ్వాసం తగ్గలేదు. సమాజ వేధింపులకు, వివక్షకు గురైనా పట్టుదలగా ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకుంది

తల్లి తండ్రుల ఆదరణకు నోచుకోలేకపోయినా ఆమెలో ఆత్మవిశ్వాసం తగ్గలేదు. సమాజ వేధింపులకు, వివక్షకు గురైనా పట్టుదలగా ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకుంది. జీవితంలో ఎన్మో ఆటుపోట్లకు గురైన విద్యవంతురాలు అనిపించుకోవడానికి బీకాం డిగ్రీలో చేరింది. అంతేకాకుండా టెలివిజన్ సీరియల్స్ లో తన ప్రతిభ ఎంటో నిరూపించుకుంది. తాజాగా లింగమార్పిడి ద్వారా టెలివిజన్ యాంకర్ గా మారి తమిళనాటనే కాకుండా దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక దృష్టిని ఆకర్షించడంలో పద్మినీ ప్రకాశ్ సఫలయ్యారు. 
 
లింగమార్పిడి కారణంగా తల్లితండ్రులు తనను దూరంగా పెట్టారని, సమాజంలో సిగ్గుపడేలా చేసిందనే భావనతో తన తల్లితండ్రులు భావించారని పద్మినీ తెలిపారు. అయినా తన పట్టుదల, అంకుఠిత దీక్ష తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని పద్మినీ తెలిపారు. తన ఉదంతం సమాజంలో లింగమార్పిడిపై ఓ అవగాహన కల్పిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలలుగన్నానని, అయితే పేదరికం కారణంగా ఆ కలను సాకారం చేసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఎన్నో వేధింపులకు, వివక్షకు గురైన పద్వినీ గురించి దేశవ్యాప్తంగా గొప్పగా మాట్లాడుకోవడం గొప్ప అనుభూతికి గురి చేస్తోందని ఆమె భర్త ప్రకాశ్ అన్నారు. సమకాలీన యాంకరింగ్ రంగంలో పద్మినీ ఓ ప్రత్యేకతను చాటుతోంది. గొప్ప యాంకర్లకు సాటిగా నిలిచింది. లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులకు సమాజం అవకాశం కల్పించాలి అని లోటస్ న్యూస్ అధినేత జీకేఎస్ సెల్వ కుమార్ అన్నారు. లింగమార్పిడి చేసుకున్న వారు సమాజంలో నిరాదరణ, వివక్షకు గురవుతున్నారని.. వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే పద్మినీకి యాంకర్ గా అవకాశమిచ్చానన్నారు. యాంకర్ గా రాణిస్తున్న పద్మినికి ముందు స్టార్ విజయ్ టెలవిజన్ లో రోజ్ వెంకటేశన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తొలి లింగమార్పిడి టెలివిజన్ షో 'ఇప్పడిక్కు రోజ్' ద్వారా యాంకర్ గా చరిత్రలోకెక్కారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement