
జవాన్లతో మోదీ దివాళి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకున్నారు.
సిమ్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనికులతో మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సిమ్లా నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్‌దో ప్రాంతంలో ఇండో టిబెటెన్ బార్డర్ పోలీస్, డోగ్రా స్కౌట్స్, ఆర్మీ జవాన్లను ఆదివారం మోదీ కలుసుకున్నారు. స్వయంగా సైనికులకు స్వీట్లు పంచుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సైతం ప్రధానితో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చాంగో గ్రామంలో మహిళలు, చిన్నారులతో మోదీ ఈ సందర్భంగా ముచ్చటించారు. మోదీ 2014 దీపావళిని సియాచిన్‌లో, 2015 దీపావళిని పంజాబ్‌లోని ఇండో పాక్ బార్డర్‌లో సైనికులతో జరుపుకున్నారు.