అసోంలో స్వల్ప భూకంపం, 6 విద్యార్థులకు గాయాలు | moderate earthquake rocks Assam | Sakshi
Sakshi News home page

అసోంలో స్వల్ప భూకంపం, 6 విద్యార్థులకు గాయాలు

Nov 6 2013 6:52 PM | Updated on Sep 2 2017 12:20 AM

అసోంలో బుధవారం భూమి స్వల్పంగా కంపించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది.

అసోంలో బుధవారం భూమి స్వల్పంగా కంపించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. ఈ సంఘటనలో పలు భవనాలకు పగుళ్లు ఏర్పడగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.

బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భూమి కొన్ని సెకెన్ల పాటు కంపించినట్టు అధికారులు చెప్పారు. గోలాఘాట్ జిల్లాలో ఓ పాఠశాలకు పగుళ్లు ఏర్పడినట్టు తెలిపారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు భవనంపై నుంచి దూకగా ఆరుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇతర ప్రభుత్వ పాఠశాలల భవనాలకు పగుళ్లు ఏర్పడినట్టు అధికారులు చెప్పారు. పాత భవనాలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement