మొరిగిందని..కుక్కను చంపాడు | man killed by dog | Sakshi
Sakshi News home page

మొరిగిందని..కుక్కను చంపాడు

Mar 27 2017 7:29 PM | Updated on Sep 5 2017 7:14 AM

నడిచి వెళ్తున్న ఓ అధికారిని చూసి ఓ కుక్క మొరిగింది. ఆగ్రహించిన అతను తన వద్ద ఉన్న తుపాకీతో దానిని కాల్చి చంపాడు.

మొరాదాబాద్‌(ఉత్తరప్రదేశ్‌): నడిచి వెళ్తున్న ఓ అధికారిని చూసి ఓ కుక్క మొరిగింది. ఆగ్రహించిన అతను తన వద్ద ఉన్న తుపాకీతో దానిని కాల్చి చంపాడు. దీనిపై కుక్క యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.  మొరాదాబాద్‌ కన్షీరాంనగర్‌లో చోటుచేసుకుంది.
 
ప్రస్తుతం బిజ్నోర్‌ ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న విమల్‌ ధీర్‌(56) శనివారం సాయంత్రం వాకింగ్ వెళ్తుండగా అశోక్‌కుమార్‌ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క మొరిగింది. దీంతో ఆగ్రహించిన విమల్‌ వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో దానిని కాల్చి చంపాడు. అశోక్‌కుమార్‌ ఆ పక్కనే గల కాలనీ నివాసి ఆ సమయంలో విమల్‌ మద్యం మత్తులో ఉన్నాడు.  ఖరీదైన తన పెంపుడు కుక్కను పొట్టనబెట్టుకున్నాడని ఆరోపించారు.  పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 429కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. విమల్‌ మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement