కరోనా: త్వరలోనే అధునాతన వెంటిలేటర్లు

Mahindra Group To Escalate Ventilator Production - Sakshi

వెంటిలేటర్ల తయారీపై  వేగం పెంచిన మహీంద్ర  అండ్ మహీంద్ర

సాక్షి, ముంబై: దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ని అడ్డుకునేందుకు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలతో అనేక కార్పొరేట్ సంస్థలు తమ వంతుగా ముందుకు వస్తున్నాయి. దీనికోసం వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నాణ్యమైన వెంటిలేటర్ల తయారీని చేపట్టింది. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన సంస్థ త్వరలోనే వెంటిలేటర్లను అందుబాటులోకి తేనున్నామని వెల్లడించింది. ఈ విషయంలో తమకు  వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని  సంస్థ ఎండీ పవన్ గోయంకా గురువారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. (కరోనా పోరుకై మరో అవకాశం సృష్టించుకోండి: డబ్ల్యూహెచ్ఓ)

వెంటిలేటర్ల తయారీకి సంబంధించి రెండు ప్రభుత్వ రంగ విభాగాల భాగస్వామ్యంతో ఇప్పటికే ఉన్న హై-స్పెక్ తయారీదారుతో కలిసి పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు రెండు విధానాలను అనుసరిస్తున్నామని వెల్లడించారు. డిజైన్‌ను, సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా ఇప్పటికే ఉన్న తయారీ సంస్థలతో చర్చిస్తున్నామనీ.. ఇందుకు తమ  ఇంజనీరింగ్ బృందం కృషి చేస్తోందన్నారు. మరోవైపు బాగ్ వాల్వ్ మాస్క్  లేదా అంబు బ్యాగ్ (వెంటిలేటర్ ఆటోమేటెడ్ వెర్షన్) తయారీపై దృష్టిపెట్టాం. మరో మూడు రోజుల్లో దీని డిజైన్ సిద్ధమవుతుందని ఆశిస్తున్నాం. ఈ డిజైన్కు ఆమోదం లభించిన తయారీ అందరికీ అందుబాటులో ఉంటుందని పవన్ గోయంకా ట్వీట్ చేశారు. 

కాగా  భయంకరమైన కరోనాను అడ్డుకునేందుకు  ఇప్పటికే దేశంలో 21 రోజుల లాక్‌ డౌన్‌ను కేంద్రం ప్రకటించింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. విమాన ప్రయాణం సహా దాదాపు అన్ని రవాణా సౌకర్యాలు పూర్తిగా స్థంభించిపోయాయి. (5లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top