ఇంజనీర్‌పై బురద పోసిన ఎమ్మెల్యే | Maharashtra Congress MLA Pours Mud On Engineer | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుందుడుకు చర్య

Jul 4 2019 2:44 PM | Updated on Jul 5 2019 8:55 AM

Maharashtra Congress MLA Pours Mud On Engineer - Sakshi

ఇంజనీర్‌పై బురద పోసి.. బ్రిడ్జికి కట్టేసేందుకు ఎమ్మెల్యే యత్నం

ముంబై : మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నితేశ్‌ రాణా దుందుడుకు చర్యకు పాల్పడ్డారు. వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ తన అనుచరులతో కలిసి ఓ ప్రభుత్వ ఇంజనీర్‌పై దాడి చేశారు. కంకావలి వద్ద ముంబై-గోవా హైవేపై ఏర్పడిన గుంతలను పరిశీలిస్తున్న క్రమంలో.. ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని అతడిపై బురద పోసి తీవ్రంగా అవమానించారు. ఆనక బాధితుడిని బ్రిడ్జికి కట్టేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నితీశ్‌ రాణా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నితీశ్‌ రాణా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నారాయణ్‌ రాణా కుమారుడు.     

కాగా ఇటీవలి కాలంలో ప్రభుత్వాధికారులపై ప్రజాప్రతినిధుల దాడులు ఎక్కువవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వర్గారియా ఓ అధికారిని బ్యాట్‌తో చితక్కొట్టగా.. తెలంగాణలో ఎమ్మెల్యే తమ్ముడు మహిళా ఎఫ్‌ఆర్వోపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం వీరిరువురి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా చేరడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement