పులి పంజాకు సింహం వెనకడుగు.. | Lion Gets Into A Fight With Tiger | Sakshi
Sakshi News home page

పులి పంజాకు సింహం వెనకడుగు..

Dec 30 2019 2:03 PM | Updated on Dec 30 2019 2:11 PM

Lion Gets Into A Fight With Tiger - Sakshi

అడవిలో సింహం పులిపై దాడికి దిగడం సహజం. కానీ, పులి సింహంపై ఎదురు దాడికి దిగితే ఎలా ఉంటుంది? ఈ రెండూ తలపడితే ఏది గెలుస్తుంది. తెలుసుకోవాలని ఉందా... అయితే ఈ వార్త చదవండి. గడ్డి మైదానంలో పులి, సింహాలు ఇతర జంతువులతోపాటు సేదతీరుతున్నాయి. ఈ క్రమంలో ఓ సింహం ఒక్కసారిగి అక్కడున్న పులిపై దాడి చేసి దాని మెడపై కొరికింది. దీంతో పులి ఒక్క ఉదుటున లేచి  సింహం ముఖం మీద దాడి చేసింది. దీంతో బెదిరిపోయిన సింహం ఏమీ చేయలేక అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోయింది. ఈ వీడియోను అటవీశాఖ అధికారి సుశాంత్‌ నందా ఆదివారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ‘‘పులి బలమైనది.. సింహం కౄరమైనది. సింహం ఎప్పుడూ ఓటమిని అంగీకరించదు. చనిపోయే వరకు పోరాడుతుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement