ఇకపై వర్క్‌ ఫ్రం హోం చేయనున్న కర్ణాటక సీఎం

Karnataka CM B S Yediyurappa Said He Will Do Work From Home - Sakshi

ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప తెలిపారు. శుక్రవారం కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) మొత్తం 198 మంది కార్పొరేటర్లతో  కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో కొంత మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తాను ఇంటి నుంచి పని చేయనున్నట్లు యడ్యూరప్ప చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త కోసం ఇంటి నుంచి పనిచేస్తున్నానని తెలిపారు. ప్రజలెవరు భయమపడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆన్‌లైన్‌ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు. (‘దయచేసి బెంగళూరును వీడొద్దు’)

ఈ విషయాని కంటే ముందు యడ్యూరప్ప రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కరోనా సెంటర్‌ కోసం బెంగుళూరులోని ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌లో 10,100 బెడ్‌లు ఏర్పాటు చేసినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రజలందరూ కరోనా గైడ్‌లైన్లకు ఫాలో అవుతూ కరోనా వ్యాప్తిని ఆరికట్టాలని యడ్యూరప్ప కోరారు. ఇదిలా వుండగా ఇప్పటి వరకు కర్ణాటకలో 30,000లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  (కరోనా భయంతో భార్యను వెళ్లగొట్టాడు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top