నేనేం ఉగ్రవాదిని కాదు.. సీఎంను: కేజ్రీవాల్‌ | I am an elected CM, not a terrorist: Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

నేనేం ఉగ్రవాదిని కాదు.. సీఎంను: కేజ్రీవాల్‌

Oct 5 2017 3:48 AM | Updated on Oct 5 2017 3:48 AM

I am an elected CM, not a terrorist: Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) అనిల్‌ బైజల్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గెస్ట్‌ టీచర్ల రెగ్యులరైజ్‌ బిల్లును ఎల్‌జీ వ్యతిరేకించడాన్ని ఢిల్లీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేజ్రీవాల్‌ తప్పుబట్టారు. ‘రెగ్యులరైజ్‌కు సంబంధించిన ఫైళ్లను డెప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు ప్రభుత్వ యంత్రాంగం ఇంతవరకు చూపించలేదు. స్వయానా విద్యామంత్రి అయిన మనీశ్‌కు సైతం ఆ ఫైళ్లను చూపకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారులను ఆదేశించారు.

మాకు చూపించనంతగా ఆ ఫైళ్లలో అంత రహస్యమేముంది? ఎల్‌జీకి ఒకటి చెప్పదల్చుకున్నా. నేను ప్రజ్వాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్రముఖ్యమంత్రిని. ఉగ్రవాదిని కాదు. మనీశ్‌ విద్యాశాఖ మంత్రి. ఉగ్రవాది కాడు. మేం ఢిల్లీ పాలకులం. ప్రభుత్వ ఉద్యోగులం కాదు. దేశంలో డెమోక్రసీ నడుస్తోంది. బ్యూరోక్రసీ కాదు’ అని కేజ్రీవాల్‌ ఆవేశంగా మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు ఉద్యో గులుగా పనిచేస్తున్న 15,000 మంది గెస్ట్‌ టీచర్ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement