వైరల్‌ వీడియో : జంతువులు సంతాపం తెలిపిన వేళ

Elephant Herd Takes Out Funeral Procession For Dead Calf - Sakshi

న్యూఢిల్లీ : మనుషులకు మాత్రమే స్పందించే గుణం ఉందనుకుంటాం. కానీ కొన్ని సార్లు జంతువులు కూడా మనుషుల్లానే స్పందిస్తాయి. విచారం, ప్రేమ, బాధ వంటి ఫీలింగ్స్‌ను వ్యక్తం చేస్తాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచిందో సంఘటన. మన ఆప్తులు చనిపోతే.. శోకించడం.. సంతాపం తెలపడం సహజం. కానీ జంతువులు కూడా ఇలానే ప్రవర్తిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరలవుతోన్న ఈ వీడియోను చూస్తే నమ్మక తప్పదనిపిస్తుంది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతోన్న ఈ వీడియోలో ఓ ఏనుగు చనిపోయిన పిల్ల ఏనుగును తీసుకొని రోడ్డు మీదకు వచ్చింది. ఆ వెంటనే చిన్నాపెద్దా ఏనుగులు దాని వెనకే వచ్చాయి. అవి అన్ని చనిపోయిన పిల్ల ఏనుగు మృతదేహం చుట్టూ చేరి.. ఓ నిమిషం పాటు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత పిల్ల ఏనుగు మృతదేహాన్ని తిరిగి అడవిలోకి తీసుకెళ్లాయి. ఈ తతంగాన్నంతా ప్రవీణ్‌ కస్వాన్‌ అనే ఫారెస్ట్‌ అధికారి వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మనుషులకే కాదు జంతువులు కూడా శోకాన్ని ప్రకటిస్తాయి.. వాటికి కూడా ఫీలింగ్స్‌ ఉంటాయి అంటున్నారు నెటిజన్లు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top