విపక్షాలూ.. రాజ్యసభలో సహకరించండి!: వెంకయ్య | Collaborate with opposition parties in the Rajya Sabha .. ! | Sakshi
Sakshi News home page

విపక్షాలూ.. రాజ్యసభలో సహకరించండి!: వెంకయ్య

Mar 7 2015 1:24 AM | Updated on Sep 2 2017 10:24 PM

రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం కీలక బిల్లుల ఆమోదం కోసం విపక్షాలను అభ్యర్థించే పనిలో పడింది.

చెన్నై: రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం కీలక బిల్లుల ఆమోదం కోసం విపక్షాలను అభ్యర్థించే పనిలో పడింది. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్, ఇతర పక్షాలు రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కోరారు. శుక్రవారమిక్కడ మీనంబాక్కం విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దేశ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్రం ఈ బిల్లులను తెచ్చింది. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదానికి రాజ్యసభలో సహకరించాలి’ అని కోరారు.    కాగా, విమానాశ్రయాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న  చెన్నై విమానాశ్రయ సిబ్బంది వెంకయ్యకు  నిరసన గళం వినిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం డౌన్.. డౌన్, విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు డౌన్..డౌన్ అని నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement