600 కోట్ల డ్రగ్స్‌ ఉన్న పాక్‌ పడవ పట్టివేత

Coast Guard seizes Pakistani boat carrying heroin worth Rs 600 crore - Sakshi

న్యూఢిల్లీ: రూ. 600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో నిండిన పాకిస్తానీ పడవను భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌–ఐసీజీ) మంగళవారం పట్టుకుంది. గుజరాత్‌ తీరానికి దూరంగా, రెండు రోజులపాటు సముద్రంలో 200 నాటికల్‌ మైళ్ల దూరం గాలించి ఈ పడవను పట్టుకున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. పడవలోని ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని ఐసీజీ అదనపు డీజీ వీఎస్‌ఆర్‌ మూర్తి తెలిపారు. నిఘా వర్గాలు, ఐసీజీ అధికారులతో కూడిన సంయుక్త బృందం వారిని విచారిస్తుందని మూర్తి వెల్లడించారు. కాగా, 8 నాటికల్‌ మైళ్లపాటు భారత జలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న ‘అల్‌–మదీనా’ అనే మరో పడవను కూడా ఐసీజీ మంగళవారం గుర్తించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top